ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రికి కరోనా

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

Published : 18 Dec 2020 18:48 IST

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. ‘ఈ రోజు నేను కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాను. దానిలో పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్‌లో ఉంటాను. గతకొన్ని రోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నాను’ అని త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు 85వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వీరిలో 1380 మంది మృత్యువాతపడ్డారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 99లక్షల 70వేలకు చేరుకుంది. వీరిలో ఇప్పటికే 95లక్షల మంది కోలుకోగా మరో లక్షా 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యం దేశవ్యాప్తంగా 11లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి..
కోట్ల హృదయాలు గెలిచి, కొవిడ్‌ ముందు ఓడారు
కొవిడ్‌19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని