పర్యటనకు వస్తే డిస్కౌంట్‌ ఇస్తారట!

కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా పర్యటక రంగం పూర్తిగా మూతపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తోన్న నేపథ్యంలో పర్యటక రంగానికి పునఃవైభవం తీసుకొచ్చేందుకు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే

Published : 18 Sep 2020 09:18 IST

ఉత్తరాఖండ్‌ వినూత్న ప్రయత్నం

(ఫొటో: ఉత్తరాఖండ్‌ టూరిజం ఫేస్‌బుక్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌ కారణంగా పర్యాటక రంగం పూర్తిగా మూతపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తోన్న నేపథ్యంలో పర్యాటక రంగానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్‌ రాష్ట్ర పర్యాటక రంగం తిరిగి కోలుకునేందుకు అక్కడి ప్రభుత్వం వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని సందర్శక ప్రాంతాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు హోటల్స్‌ బుకింగ్‌లో డిస్కౌంట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ‘టూరిస్ట్‌ ఇన్సెంటివ్‌ కూపన్‌’ పథకాన్ని ప్రవేశపెట్టింది. పథకంలో భాగంగా పర్యాటకుల హోటల్స్‌ బుకింగ్‌లో రూ.1000 లేదా 25శాతం డిస్కౌంట్‌ ఇవ్వనుంది.

ఈ డిస్కౌంట్‌ కూపన్‌ పొందాలంటే ఉత్తరాఖండ్‌ పర్యాటకశాఖ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కనీసం మూడు రోజులు ఉండేలా బుకింగ్‌ చేసుకునేవారికే ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుంది. పర్యాటక ప్రాంతాల్లోని ఏ హోటల్‌లో గది బుక్‌ చేసుకున్నా ఈ డిస్కౌంట్‌ లభిస్తుంది. అయితే బుకింగ్‌ ధరలో రూ. 1000 లేదా 25శాతం ఏది తక్కువ ఉంటే దాన్నే ప్రభుత్వం చెల్లిస్తుంది. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే యాత్రికులు కూడా ఈ కూపన్‌ పొందొచ్చట. ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగం పునురుద్ధరణలో భాగంగా పైలట్‌ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి సత్పాల్‌ మహారాజ్‌ వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని