కరోనాను ఆపడానికి వ్యాక్సిన్‌ ఒక్కటే చాలదు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను వ్యాక్సిన్‌ ఒక్కటే అడ్డుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియోసిస్‌ వ్యాఖ్యానించారు. కరోనాపై పోరాటానికి మన వద్ద ఉన్న ఇతర సాధనాలకు.........

Published : 17 Nov 2020 01:50 IST

డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ వ్యాఖ్య

జెనీవా: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను వ్యాక్సిన్‌ ఒక్కటే అడ్డుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియోసిస్‌ వ్యాఖ్యానించారు. కరోనాపై పోరాటానికి మన వద్ద ఉన్న ఇతర సాధనాలకు ఇది సంపూర్ణతను మాత్రమే ఇస్తుంది తప్ప వాటిని భర్తీ చేయలేదన్నారు. సోమవారం టెడ్రోస్‌ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై ప్రారంభంలో పరిమితులు ఉంటాయని, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇలా చేయడం వల్ల కరోనా మరణాలు తగ్గించగలుగుతామన్నారు. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. అందుకోసం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను మున్ముందు కొనసాగించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వైరస్‌పై నిఘాను కొనసాగించాలని, ప్రజలు పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైరస్‌ సోకినవారిని ఐసోలేట్‌ చేసి వారిపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సోకిన వ్యక్తులను కలిసిన వారిని గుర్తించడం, చికిత్స అందించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. 
మరోవైపు, శనివారం ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా 6,60,905 కొత్త కేసులు వచ్చినట్టు యూఎన్‌ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఈ మహమ్మారి 54 మిలియన్ల మందిని సోకగా.. దీంతో 1.3మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని