నెలలోపే వ్యాక్సిన్ - ట్రంప్!
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. నవంబర్ కన్నా ముందే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోందంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి అభిప్రాయపడ్డారు. వచ్చే మూడు, నాలుగు వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు తుది దశ ప్రయోగాలకు చేరుకున్నాయి. వీటిలో కొన్నింటిని అత్యవసర వినియోగానికి రష్యా, చైనా వంటి దేశాలు అనుమతులు కూడా ఇచ్చాయి. ఇక ఈ వ్యాక్సిన్లు మరికొద్ది నెలల్లోనే ప్రజావినియోగానికి అందుబాటులోకి వస్తాయని అంతర్జాతీయంగా పలు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘కరోనా వ్యాక్సిన్ పొందేందుకు చాలా దగ్గరకు చేరుకున్నాం. రానున్న కొన్ని వారాల్లోనే అది అందుబాటులోకి రానుంది. అది మూడు, నాలుగు వారాల్లోపే రావచ్చు’ అని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ప్రభుత్వంలో వేరేవారు ఉంటే, వ్యాక్సిన్ రావడానికి మరిన్ని సంవత్సరాలు పట్టేదని అభిప్రాయపడ్డారు. కానీ, ఎఫ్‌డీఏతో పాటు మరిన్ని అనుమతులతో వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఓటర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో వ్యాక్సిన్ గురించి ఓటర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ ఈ విషయం చెప్పారు. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా మహమ్మారి దానంతట అదే మాయమవుతుందని ట్రంప్ చెప్పడం కొసమెరుపు.
ఇదిలాఉంటే, నవంబర్ మూడో తేదీన జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ తీసుకురావడం కోసం ఎఫ్‌డీఏ మీద వైట్‌హౌజ్ ఒత్తిడి తెస్తోందనే విమర్శలు పెరిగిపోయాయి. ఈ విషయంపై ఇప్పటికే వైట్‌హౌజ్ క్లారిటీ ఇచ్చింది. అయితే, ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో శాస్త్రీయంగా నిరూపితమయ్యే వరకూ దీన్ని విడుదల చేయమని ఆస్ట్రాజెనికాతోపాటు వ్యాక్సిన్ తయారుచేస్తోన్న తొమ్మిది సంస్థలు ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అమెరికాలో వ్యాక్సిన్ విడుదలపై ట్రంప్ ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇవీ చదవండి..
భారత్‌లోనూ ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు పున:ప్రారంభం
కరోనా విలయం: 50లక్షలు దాటిన కేసులు!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Shashi Tharoor: శశిథరూర్‌కి ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం
-
Movies News
Sita Ramam: ‘సీతారామం’తో మరో సినిమా చేస్తాం: హను రాఘవపూడి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
CM Kcr: 5వేల అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
-
Politics News
Bihar: రెండువారాల తర్వాత నీతీశ్ బలపరీక్ష.. ఆలస్యానికి కారణం ఏంటంటే..?
-
Technology News
Google Maps: స్మార్ట్‌వాచ్‌లలో గూగుల్ మ్యాప్స్.. ఎలాగంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా
- Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
- Tollywood Movies: ఈ వసూళ్లు చూసి సంబరాలు చేసుకోకూడదు: తమ్మారెడ్డి భరద్వాజ
- IT Jobs: ఐటీలో వలసలు తగ్గుతాయ్
- Smoking In Plane: విమానంలో దర్జాగా పడుకొని సిగరెట్ స్మోకింగ్.. డీజీసీఏ సీరియస్..!
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!