ఏడాది చివరికి వ్యాక్సిన్‌: WHO

కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా ఆశలు రేకెత్తుతున్నాయన్నారు........

Published : 07 Oct 2020 09:50 IST


జెనీవా: కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా ఆశలు రేకెత్తుతున్నాయన్నారు. యావత్తు ప్రపంచం వ్యాక్సిన్‌ కోసం వేచిచూస్తోందని తెలిపారు. ఒక్కసారి టీకా అందుబాటులోకి రాగానే వాటి పంపిణీ కోసం అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా దేశాధినేతల హామీ ఈ తరుణంలో అత్యవసరమని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీలో సహకారం కోసం ప్రపంచ దేశాలు కోవాక్స్‌ పేరిట కూటమి కట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కూటమి ఆధ్వర్యంలో తొమ్మిది వ్యాక్సిన్లు అభివృద్ధిలో దశలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఫైజర్‌ కంపెనీ తయారు చేస్తున్న టీకాపైనే అందరి ఆశలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని