టీకా వచ్చినా.. తక్షణమే కొవిడ్‌ అదుపులోకి రాదు..! 

మూడు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే కొవిడ్‌ వ్యాక్సిన్‌ మోతాదు పెరిగే కేసులను నిరోధించేందుకు సరిపోదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Updated : 03 Dec 2020 16:36 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

జెనీవా: మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్నమాట నిజమే అయినప్పటికీ.. పెరుగుతున్న కేసులను కట్టడి చేయడానికి అవసరమైనన్ని టీకాలు ఇప్పట్లో అందుబాటులోకి రాకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.  మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాస్క్‌, సామాజిక దూరం తదితర కొవిడ్‌ నిబంధనలను పాటించడం ఆపవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో ఉత్పత్తి చేసే కొవిడ్‌ వ్యాక్సిన్లు .. పెరిగే కేసులను నిరోధించేందుకు చాలకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ మైక్‌ ర్యాన్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ మరింత కట్టుదిట్టం చేసింది. కనీసం మూడు అడుగుల సామాజిక దూరం పాటించటం సాధ్యం కాని పని ప్రదేశాలు, దుకాణాల్లో.. ప్రజలు నిరంతరం మాస్కులు ధరించే ఉండాలని సూచించింది. ఆయా ప్రదేశాల్లో గాలి వెలుతురు సోకుతున్నా.. 12 ఏళ్లు, అంతకు మించి వయస్సున్న వారు మాస్కులు ధరించటం తప్పనిసరి అని ప్రకటించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని