డ్రైవింగ్‌ లైసెన్స్‌ల అనుమతుల పొడిగింపు

డ్రైవింగ్‌ లైసెన్సు తదితర అనుమతి పత్రాల చెల్లుబాటు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది.

Published : 01 Sep 2020 01:19 IST

ఎప్పటి వరకు అంటే...

దిల్లీ: దేశంలో మోటారు వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్సు తదితర అనుమతి పత్రాల చెల్లుబాటు తేదీని కేంద్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్సు, వాహన బీమా, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్‌ తదితర వివిధ పత్రాల చెల్లుబాటు తేదీని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. అయితే ఈ వెసులుబాటు ఈ సంవత్సరం ఫిబ్రవరి 1 తరువాత లేదా డిసెంబర్‌ 31 లోగా గడువు ముగియనున్న పత్రాలకు మాత్రమే వర్తిస్తుందని వివరించింది. కాగా, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఈ విధంగా వాహన పత్రాల గడువు పొడిగించటం ఇది మూడోసారి.

‘‘కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా ప్రభావితమైన ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ.. పైన చెప్పిన అన్ని ధ్రువపత్రాల చెల్లుబాటు తేదీని పొడిగించాము. ఫిబ్రవరి 2020 అనంతరం లేదా డిసెంబరు 31 లోగా గడువు ముగిసిపోయే వాహన సంబంధ  ధ్రువపత్రాలన్నీ చెల్లుబాటు అవుతాయి. ఆయా ధ్రువపత్రాలను 31 డిసెంబర్‌ వరకు పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.’’ అని అధికారిక ప్రకటన తెలియచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని