నిలకడగా వరవరరావు ఆరోగ్యం

విరసం నేత, కవి వరవరరావు డిసెంబర్‌ 14 వరకు ఆసుపత్రిలోనే చికిత్ప పొందనున్నట్లు ముంబయి హైకోర్టు గురువారం తెలిపింది. 81 సంవత్సరాల వరవరరావుకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర దర్యాప్తు బృందం గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  ఆయన నాడీ వ్యవస్థ సంబంధ వ్యాధితో బాధపడుతుండటంతో, కొవిడ్‌-19 జాగ్రత్తల దృష్ట్యా నవంబర్‌ 18న ఆసుపత్రిలో చేర్పించారు...

Updated : 03 Dec 2020 22:29 IST

ముంబయి: విరసం నేత, కవి వరవరరావు డిసెంబర్‌ 14 వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందనున్నట్లు ముంబయి హైకోర్టు గురువారం తెలిపింది. 81 సంవత్సరాల వరవరరావుకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర దర్యాప్తు బృందం గతంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన నాడీ వ్యవస్థ సంబంధ వ్యాధితో బాధపడుతుండటంతో, కొవిడ్‌-19 జాగ్రత్తల దృష్ట్యా నవంబర్‌ 18న ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు నానావతి ఆసుపత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమర్పించిన రిపోర్టులను కోర్టు పరిశీలించింది.
‘‘వరవరరావు ఆరోగ్య పరిస్థితి  నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. డిసెంబర్‌ 14 వరకు ఆసుపత్రిలోనే చికిత్స పొందాలి’’ అని జస్టిస్‌ ఎస్‌ఎస్‌ షిండే, ఎంఎస్‌ కార్నిక్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య హేమలత వేసిన పిటిషన్‌ను డిసెంబర్‌ 14న హైకోర్టు పరిశీలించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని