
అమెరికా 2020: ఈ రాష్ట్రాలే మిగిలాయ్
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో మ్యాజిక్ ఫిగర్(270)కు దాదాపు చేరువయ్యారు. అయితే ఇంకా ఫలితం తేలాల్సిన రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో ఫలితాలు రాగా.. ఇంకా ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు రావాల్సిన రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..
పెన్సిల్వేనియా..
ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ ఇంకా 7,65,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇందులో కనీసం 59 నుంచి 61శాతం ఓట్లు బైడెన్‌కి వస్తేనే గానీ పెన్సిల్వేనియాలో డెమొక్రటిక్ అభ్యర్థి నెగ్గలేరు.
జార్జియా..
జార్జియాలోనూ ట్రంప్, బైడెన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కడపటి సమాచారం వరకు ట్రంప్.. బైడెన్‌పై 48వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇక్కడి ఓట్ల లెక్కింపుపై ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ ట్రంప్ ఓడిపోతే రీకౌంటింగ్ చేయాలని రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు.
నార్త్ కరోలినా..
ఈ రాష్ట్రంలోనూ ట్రంప్, బైడెన్ మధ్య ఓట్ల తేడా కేవలం 2శాతం కంటే తక్కువగానే ఉంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. బైడెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇక్కడ నవంబరు 12 వరకు పోస్టల్ బ్యాలెట్‌ను అనుమతించారు. దీంతో ఇక్కడి ఫలితాలు కాస్త ఆలస్యమయ్యేలా కన్పిస్తున్నాయి.
నెవాడా..
ఈ రాష్ట్రంలో కూడా బైడెన్.. ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ట్రంప్ కంటే బైడెన్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా.. నెవాడా ఫలితాలపై కూడా అనుమానం వ్యక్తం చేస్తోన్న ట్రంప్ లెక్కింపుపై కోర్టుకెళ్లే యోచనలో ఉన్నారు.
అలస్కా..
ఈ రాష్ట్రంలో మూడు ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఇప్పటికే పెన్సిల్వేనియా, మిషగన్లలో ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్ బృందం.. అక్కడి కోర్టులో దావా వేసింది. నెవెడా, అరిజోనా ఫలితాలపై కూడా కోర్టు వెళ్లాలని ట్రంప్ యోచనలో ఉన్నారు.
ఇవీ చదవండి..
మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో బైడెన్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Afghanistan Earthquake: ఆదరించిన కుటుంబం మరణించిందని తెలియక..!
-
Movies News
Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
-
Business News
Car Loan: ఈఎంఐ భారం కావొద్దంటే కారు లోన్‌కు ఏ వడ్డీరేటు బెటర్?
-
Sports News
IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
-
Politics News
Telangana News: హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు
-
Politics News
Maharashtra: ‘మహా’ సంక్షోభం.. ఠాక్రే సర్కారుకు రేపే బలపరీక్ష
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?