గాలి కాలుష్యంపై యుద్ధం చేస్తాం

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌ సోమవారం ఓ మెగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘‘యుద్ధ్‌ ప్రదూషణ్‌ కే విరుద్ధ్‌

Published : 06 Oct 2020 01:43 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌ సోమవారం ఓ మెగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డిజిటల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘యుద్ధ్‌ ప్రదూషణ్‌ కే విరుద్ధ్‌ ’ పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 13 కాలుష్య హాట్‌స్పాట్‌లకు ఒక్కోదానికి ప్రత్యేక ప్రణాళికలు రచించామన్నారు.

‘‘కరోనా మహమ్మారి వేళ కలుషితమైన గాలి ఎంతో ప్రాణాంతకమైనది. దీని ద్వారా ఊపిరితిత్తుల పని తీరు దెబ్బతింటుంది. ప్రభుత్వం కాలుష్య నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ‘వార్‌ రూమ్‌’ ఏర్పాటు చేస్తున్నాం. ‘గ్రీన్‌ దిల్లీ’ పేరిట మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తేనున్నాం. దీనిని ఉపయోగించడం ద్వారా చెత్తను దహనం చేయటం, పారిశ్రామిక కాలుష్యం వంటి వాటిని ప్రజలు మా దృష్టికి తీసుకురావచ్చు. ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం.

ధూళి కాలుష్య  నియంత్రణకు కోసం పనిచేసే సంబంధిత శాఖలకూ ఆదేశాలు జారీ చేశాం. నిర్మాణాలు జరిగే స్థలాలపై తనిఖీ బృందాల పర్యవేక్షణ పెట్టాం. దిల్లీలో కాలుష్యం పెరగడానికి మిగిలిపోయిన పంట వ్యర్థాలను సమీప ప్రాంతాల్లో దహనం చెయ్యడమూ ఓ కారణమే. ఇక్కడి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఈ సమస్య పరిష్కారానికి ఓ మార్గం కనుగొన్నారు. వాటిని ఎరువుగా ఉపయోగించుకునే మార్గాన్ని సూచించారు.  దీన్ని మంగళవారం నుంచి పెద్ద ఎత్తున అమలు చేస్తాం. ఈ సారికి ఈ ప్రక్రియను దిల్లీలోనే ఉపయోగిస్తాం. రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకూ సూచిస్తాం’’ అని కేజ్రీవాల్ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని