వ్యాక్సిన్‌ కోసం వేచి చూడొద్దు: డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న వేళ ప్రస్తుతం వ్యాక్సిన్‌ కోసం వేచిచూడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం విశేష కృషి జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రాణాలను కాపాడటమే మన తక్షణ కర్తవ్యమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్ స్పష్టం చేశారు.

Updated : 13 Sep 2022 14:56 IST

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలతోనే వైరస్‌ కట్టడికి కృషి
ప్రపంచదేశాలకు పిలుపునిచ్చిన డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌

జెనీవా: కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ ప్రస్తుతం వ్యాక్సిన్‌ కోసం వేచిచూడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కోసం విశేష కృషి జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రాణాలను కాపాడటమే మన తక్షణ కర్తవ్యమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్ స్పష్టం చేశారు.

‘తప్పు చేయెద్దు, వ్యాక్సిన్‌ పరిశోధనను మరింత వేగవంతం చేయాలి. ఈ సమయంలోనే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సాధనాలతోనే విస్తృతంగా కట్టడి చేయాలి’ అని టెడ్రోస్‌ పునరుద్ఘాటించారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గడచిన వారంరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల కరోనా కేసులు నమోదవడం వైరస్‌ తీవ్రతకు అద్దంపడుతోందని అన్నారు. ఈ సమయంలో యూకే వ్యాక్సిన్‌ ఫలితాలను డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ స్వాగతించారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టడంతోపాటు అవసరమైనన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచదేశాలకు సూచించారు.

ఒకవేళ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ పంపిణీ చేసే కచ్చితమైన విధానం లేదని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ వచ్చాక సరఫరా సమస్యలు ఏర్పడే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ప్రజల భాగస్వామ్యం, బలమైన నాయకత్వం, సమగ్ర వ్యూహంతో కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని నిరోధించవచ్చని ప్రపంచదేశాలకు సూచించారు. ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ కేసుల సంఖ్య కోటీ 45లక్షలకు చేరిలో వీరిలో ఇప్పటికే 6లక్షలకుపైగా బాధితులు మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..
భారత్‌: కరోనా మరణాల్లో ప్రపంచంలోనే 7వ స్థానంలోకి..

వాల్వ్‌ మాస్కులతో ప్రమాదం..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని