అప్పుడూ ఉన్నాం.. ఇకపైనా నితీశ్‌తోనే

ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వెంటే ఉంటామని బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) అధ్యక్షుడు జీతన్‌రాం మాంఝీ స్పష్టం చేశారు....

Updated : 13 Nov 2020 15:38 IST

స్పష్టంచేసిన మాజీ ముఖ్యమంత్రి మాంఝీ పార్టీ

దిల్లీ: ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వెంటే ఉంటామని బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) అధ్యక్షుడు జీతన్‌రాం మాంఝీ స్పష్టం చేశారు. గతంలోనూ ఆయనతోనే ఉన్నామని, ఇకపై కూడా ఆయనతోనే ఉంటామని శుక్రవారం పేర్కొన్నారు. ‘ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాం. ఎన్‌డీఏతోనే ఉంటాం. ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ అధ్యక్షతనే హెచ్‌ఏఎం ఈ ఎన్నికల్లో పోటీచేసినట్లు మా నేత జీతన్‌రాం మాంఝీ గతంలోనే పేర్కొన్నారు. మేము నీతీశ్‌ వెంటే ఉన్నాం. ఆయన వెంటే ఉంటాం’ అని పార్టీ నేతలు వెల్లడించారు. జీతన్‌రాం మాంఝీని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకొన్న అనంతరం ఆ పార్టీ నేతలు పైవిధంగా స్పందించారు.

బిహార్‌లో నీతీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ మెజారిటీ కూడగట్టుకుంది. ఎన్నికల్లో 125 స్థానాలు సాధించి మెజారిటీకి కావాల్సిన 122 సంఖ్యను దాటవేసింది. భాజపా, జనతాదళ్‌‌ (యునైటెడ్‌), వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ, హెచ్‌ఏఎం కలిసి ఎన్‌డీగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీచేశాయి. కాగా, భాజపా 74 సీట్లు, నీతీశ్‌కు చెందిన జేడీయూ 43 స్థానాలు, వికాస్‌ ఇన్‌సాన్‌ పార్టీ, హెచ్‌ఏఎం చెరో నాలుగు స్థానాల్లో గెలుపొందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని