మొదట హనుమాన్ ఆలయదర్శనం..ఎందుకంటే?

రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా గమనించింది.

Published : 06 Aug 2020 00:47 IST

అయోధ్య: రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా గమనించింది. ప్రధాని మోదీ దశలవారీగా ఆ అద్భుత ఘట్టంలో పాలుపంచుకున్నారు. ఈక్రమంలో భూమిపూజ జరిగే ప్రదేశానికి చేరుకోవడానికి ముందు మోదీ హనుమాన్‌గఢీలో 15 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి ఆలయ ప్రధాన అర్చకుడు మోదీకి తలపాగా అందజేశారు. అయోధ్య చేరుకున్న మోదీ అన్నింటికంటే ముందుగా హనుమాన్‌ ఆలయానికి చేరుకోడానికి ఓ కారణముందని అక్కడి అర్చకులు అన్నారు. పురాణాల ప్రకారం రాముడి పరమభక్తుడైన హనుమంతుడి ఆశీర్వాదం లేకుండా ఏపనీ పూర్తి కాదని చెప్పారు. ‘రావణుడిని అంతమొందించిన తరవాత రాముడు అయోధ్యకు తిరుగుపయనమయ్యాడు. ఆ సందర్భంలో హనుమంతుడు నివసించడానికి రాముడు ఈ ప్రాంతాన్ని ఆయనకు అప్పగించాడు. అందుకే ఈ ప్రాంతాన్ని హనుమాన్‌గఢీ లేక హనుమాన్కోటగా పిలుస్తారు. అక్కడి నుంచి రామకోటను హనుమంతుడు పరిరక్షిస్తున్నాడని ఓ నమ్మకం’ అని వెల్లడించారు. ఉత్తర భారతంలోని ప్రఖ్యాత ఆలయాల్లో హనుమాన్‌గఢీ ఒకటని పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని