పెన్సిల్వేనియాలో ఓటమి దిశగా బైడెన్‌..!

పెన్సిల్వేనియా రాష్ట్రం ట్రంప్‌, బైడెన్‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. తమ తుదివిడత ప్రచారంలో దీనిపై ఎక్కవ దృష్టిసారించారు. కీలకమైన స్వింగ్‌స్టేట్స్‌లో అత్యధిక ఓటర్లు

Updated : 05 Nov 2020 15:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పెన్సిల్వేనియా రాష్ట్రాన్ని ట్రంప్‌, బైడెన్‌లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు. తమ తుదివిడత ప్రచారంలో దీనిపై ఎక్కువ దృష్టి సారించారు. కీలకమైన స్వింగ్‌స్టేట్స్‌లో అత్యధిక ఓటర్లు ఉన్న మూడో పెద్ద  రాష్ట్రం. ఇక్కడ  దాదాపు 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో గెలుపు కోసం బైడెన్‌ విపరీతంగా శ్రమించారు.  2016లో ఈ రాష్ట్రం ట్రంప్‌ విజయంలో కీలక  పాత్ర పోషించింది. గతంలో డెమొక్రాట్లకు ఇక్కడ పట్టు ఉండగా.. గత ఎన్నికల్లో ఇది రిపబ్లికన్ల ఖాతాలో చేరింది. అంతకు ముందు ఇక్కడ డెమొక్రాట్లు ఆరు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అన్నింటికీ మించి ఇది జో బైడెన్‌ పుట్టింది ఈ రాష్ట్రంలోనే. తర్వాత వారి కుటుంబం డెలావర్‌కు మారింది. దీంతో తాను పుట్టిన రాష్ట్రంలో ఎన్నిక ఆయనకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఇక్కడ మూడు వారాల క్రితం వరకు నిర్వహించిన అభిప్రాయ సేకరణల్లో బైడెన్‌  దాదాపు 7 పాయింట్ల వరకు ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. కానీ, చివర్లో ఇక్కడ ట్రంప్‌ దూకుడుగా పుంజుకొన్నారు. ఎన్‌పీఆర్‌.ఓఆర్‌జీ సర్వేలో కూడా స్వింగ్‌ స్టేట్స్‌లో పెన్సిల్వేనియాలో పట్టుసాధించిన వారే వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇక్కడ నల్లజాతి ఓటర్లను ఆకట్టుకునేందుకు మాజీ అధ్యక్షుడు ఒబామాను కూడా డెమొక్రాటిక్‌ పార్టీ రంగంలోకి దింపింది.

అప్పట్లో కేవలం ఒక్కశాతం కంటే తక్కువ ఓట్లతో దీనిని ట్రంప్‌ గెలుచుకొన్నారు. ఇక్కడ బొగ్గు, స్టీల్‌ పరిశ్రమల్లో పనిచేసే బ్లూకాలర్‌ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు.. ఇక్కడ ఓటర్లలో దాదాపు 84శాతం మంది శ్వేతజాతీయులు. వీరిలో 54శాతం మంది కళాశాల విద్యాభ్యాసం కూడా పూర్తి చేయని వారు ఉన్నారు. దీంతో వీరంతా ట్రంప్‌ పక్షానికి మళ్లారు. ముఖ్యంగా సబ్‌అర్బన్‌ మహిళల్లో ట్రంప్‌కు ఆదరణ తగ్గినట్లు అంచనాలు వెలువడ్డాయి. దీంతో అక్టోబర్‌ 13న జాన్స్‌టౌన్‌లో జరిగిన ఒక ర్యాలీలో  ట్రంప్‌ మాట్లాడుతూ ‘‘పట్టణ శివారు ప్రాంతాల్లోని మహిళలు.. మీరు నాకు దయచేసి ఓటు వేయండి.. ప్లీజ్‌.. ప్లీజ్‌..’’ అని కోరారు. అది కూడా కొంత పనిచేసిందనే చెప్పాలి. దీంతోపాటు బైడెన్‌ వస్తే బొగ్గు పరిశ్రమకు కష్టకాలం వస్తుందని ట్రంప్‌ చెప్పిన మాటలతో అక్కడి వారు ఏకీభవించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం ఈ రాష్ట్రంలో  జో బైడెన్‌కు 42.1శాతం ఓట్లు లభించగా.. ట్రంప్‌కు 56.7శాతం ఓట్లు లభించాయి. ఇప్పటికి 64శాతం ఓట్లను లెక్కించారు.

ఇవీ చదవండి

ట్రంప్‌ స్వింగ్‌ బాల్‌..!

ఓటమి కంటే గెలుపే సులువు.. ట్రంప్‌

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts