ఆ చట్టాలు రద్దు చేయకుంటే ఖేల్‌రత్న వెనక్కి

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయకుంటే తనకు ఇచ్చిన రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని ప్రముఖ బాక్సర్‌, ఒలింపిక్‌ విజేత విజేందర్‌ అన్నారు.......

Updated : 06 Dec 2020 16:10 IST

దిల్లీ: కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయకుంటే తనకు ఇచ్చిన రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తానని ప్రముఖ బాక్సర్‌, ఒలింపిక్‌ విజేత విజేందర్‌ తెలిపారు. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆదివారం సంఘీభావం ప్రకటించిన ఆయన ఈ మేరకు అవార్డు వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా రైతుల ఆందోళనలో పాల్గొని మాట్లాడారు.

ఇప్పటికే పంజాబ్‌, హరియాణాకు చెందిన పలువురు క్రీడాకారులు రైతుల ఆందోళనకు మద్దతుగా తమ పురస్కారాలను వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో హరియాణాకు చెందిన విజేందర్‌ కూడా చేరారు. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ సైతం తన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చి రైతుల ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మరోవైపు వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు పలు రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ యూనియన్లు మద్దతు ప్రకటించాయి.

ఇవీ చదవండి..

రైతుల ఆందోళన: పార్లమెంటు ప్రత్యేక సమావేశం?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని