500 గంటలైనా సరే ఇక్కడే ఉంటా: రాహుల్‌

కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేంగా చేపట్టిన ‘ఖేతీ బచావో ర్యాలీ’ మంగళవారం స్వల్ప ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి రాహుల్‌ పంజాబ్‌ నుంచి హరియాణాలోకి ప్రవేశించే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

Published : 07 Oct 2020 02:14 IST

చండీగఢ్‌: కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేంగా చేపట్టిన ‘ఖేతీ బచావో ర్యాలీ’ మంగళవారం స్వల్ప ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి రాహుల్‌ పంజాబ్‌ నుంచి హరియాణాలోకి ప్రవేశించే యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. సరిహద్దులో భారీగా మోహరించిన పోలీసులు ఆయన్ను హరియాణాలోకి ప్రవేశించడానికి అనుమతించేది లేదని చెప్పారు. దీంతో రాహుల్‌ గాంధీ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్‌.. ‘మేం ప్రశాంతంగా చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. వారు మమ్మల్ని వదిలిపెట్టే వరకు మేం ఇక్కడే ఉంటాం. అది రెండు గంటలైనా సరే.. 500 గంటలైనా సరే. శాంతియుతంగా మేం ఇక్కడే వేచి ఉంటాం. వారు సరిహద్దులు తెరిచి ఉంటే మేం ప్రశాంతంగా వెళ్లేవాళ్లం’అని రాహుల్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌, హరియాణాల్లో మూడు రోజుల పాటు ఖేతీ బచావో ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. కాగా మంగళవారం రాహుల్‌ స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని