బాధ్యతలు చేపట్టాక అదే ప్రథమ కర్తవ్యం: హారిస్‌

యూఎస్‌ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా ప్రజలను కొవిడ్‌-19 నుంచి రక్షించడమే తమ ప్రథమ కర్తవ్యమని.. ఆ పదవికి నూతనంగా ఎన్నికైన కమలా హారిస్‌ అన్నారు. అంతేకాకుండా యూఎస్‌లో ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉన్న ‘డ్రీమర్స్‌’కు పౌరసత్వం కల్పించే చర్యలు సైతం చేపడతామని ఆమె ప్రకటించారు.

Published : 30 Dec 2020 01:42 IST

వాషింగ్టన్‌: యూఎస్‌ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా ప్రజలను కొవిడ్‌-19 నుంచి రక్షించడమే తమ ప్రథమ కర్తవ్యమని.. ఆ పదవికి నూతనంగా ఎన్నికైన కమలా హారిస్‌ అన్నారు. అంతేకాకుండా యూఎస్‌లో ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉన్న ‘డ్రీమర్స్‌’కు పౌరసత్వం కల్పించే చర్యలు సైతం చేపడతామని ఆమె ప్రకటించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

‘యూఎస్‌ అధ్యక్షుడిగా జోబైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా నేను బాధ్యతలు చేపట్టిన వెంటనే కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టడమే మా ప్రథమ ప్రాధాన్యం. ఆ మహమ్మారి నుంచి దేశ పౌరులను రక్షించేందుకు కృషి చేస్తాం. అదేవిధంగా దేశంలో ధ్రువీకరణ పత్రాలు లేకుండా ఉన్న ‘డ్రీమర్స్‌’ను కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం.  11మిలియన్ల మందికి పౌరసత్వం కల్పించే విధంగా బిల్లు రూపొందించి కాంగ్రెస్‌కు పంపుతాం. అంతేకాకుండా పారిస్‌ వాతావరణ ఒప్పందంలోకి తిరిగి అమెరికాను తిరిగి చేర్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’ అంటూ హారిస్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

బాల్యంలోనే యూఎస్‌లోకి ప్రవేశించి, పౌరసత్వం లేకుండానే అక్కడ పెరిగి పెద్దయిన వారిని ‘డ్రీమర్స్‌’ అని పిలుస్తారు. ట్రంప్‌ వారిని అక్రమ వలసదారులుగా పేర్కొన్నారు. మరోవైపు వాతావరణ మార్పుల ముప్పు విషయంలో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో పారిస్‌ ఒప్పందాన్ని 2015లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందంలో నుంచి వైదొలుగుతూ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

ఇదీ చదవండి

పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా బయటకు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని