
ఓటమి కంటే గెలుపే సులువు.. ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటమి కంటే గెలుపే తనకు సులభమని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. తన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓటమిని తట్టుకోవటం తనకు చాలా కష్టసాధ్యమని ఆయన వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను గెలుపోటముల గురించి ఆలోచించడం లేదని వేదాంత ధోరణిలో మాట్లాడారు. వర్జీనియా రాష్ట్రంలోని ఆర్లింగ్టన్ పట్టణ ఎన్నికల కార్యాలయాన్ని అధ్యక్షుడు మంగళవారం సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘గెలవటం సులభం. ఓడిపోవటం ఎప్పటికీ సులువు కాదు. నాకు సంబంధించినంతవరకు అది సులువు కాదు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఇచ్చే ‘యాక్సెప్టెన్స్ స్పీచ్’ లేదా ఓడిన సందర్భంగా మాట్లాడే ‘కన్సెషన్ స్పీచ్’ల గురించి నేను ఇప్పుడు ఆలోచించడం లేదు. అభ్యర్థులకు ఆ రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరి అనేది తెలిసిందే. ’’ అని ఆయన మీడియాకు తెలిపారు. కాగా పోలింగ్ సరళిని బట్టి మంగళవారం రాత్రికల్లా (స్థానిక కాలమానం ప్రకారం) ఎవరు గెలిచిందీ స్పష్టం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Pant - Dravid : రిషభ్ పంత్ షాట్లు కొడుతుంటే ఒక్కోసారి మా హార్ట్‌బీట్ పెరుగుతోంది: ద్రవిడ్
-
India News
Lalu Prasad Yadav: కుదుటపడని లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు తరలింపు..!
-
Politics News
Chandrababu: అమ్మ ఒడి బూటకం.. ఇంగ్లిష్ మీడియం ఒక నాటకం: చంద్రబాబు
-
World News
China: చైనాకు కరోనా తిప్పలు.. మరోసారి వైరస్ విజృంభణ..!
-
Politics News
LPG Hike: ‘మహా’ ఖర్చులను పూడ్చుకునేందుకే గ్యాస్ ధరను పెంచారా?
-
Sports News
IND vs ENG : ఇంగ్లాండ్ వేదికగా.. పొట్టి కప్ కోసం సమర శంఖం పూరించేనా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?