88వ వసంతంలోకి మన్మోహన్‌ సింగ్‌

దేశానికి మన్మోహన్‌ సింగ్‌ లాంటి ప్రధాని లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని..

Published : 26 Sep 2020 17:11 IST

శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు

దిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శనివారం 88వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయనకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘లోతుగా విశ్లేషించే డా.మన్మోహన్‌సింగ్ లాంటి ప్రధాని లేని లోటు దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నిజాయితీ, అంకితభావం మనందరికి స్ఫూర్తినిస్తాయి’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సహా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పలువురు నేతలు మాజీ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌ ద్వారా పార్టీ ఆయనకు ఓ అపురూపమైన వీడియోను అంకితమిచ్చింది. మన్మోహన్‌సింగ్‌ బాల్యం, చదువు, ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన సలహాదారు, ఆర్‌బీఐ గవర్నర్‌ సహా ఆయన చేపట్టిన పదవులను గుర్తుచేశారు. ప్రధానిగా ఆయన చేసిన సేవలు, ప్రజల అభ్యున్నతి కోసం ప్రధాని కాలంలో చేపట్టిన చట్ట సవరణలను వీడియోలో చూపించారు. ‘అత్యంత సమర్థవంతమైన ప్రపంచ నాయకులలో ఒకరని, దేశ శ్రేయస్సు కోసం రాజీ పడని మహా నేత’ అంటూ పార్టీ ట్వీట్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని