సిద్ధమైన ప్రపంచ అతిపెద్ద సొరంగ రహదారి  

ప్రపంచంలోని అతిపెద్ద సొరంగ మార్గం (అటల్‌ టన్నెల్‌) ఎట్టకేలకు పూర్తైంది. మనాలి నుంచి లేహ్‌ వరకూ 9.2 కిలోమీటర్లు ఉన్న సొరంగ రహదారి భూమికి 10వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఆరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని.......

Published : 17 Sep 2020 09:55 IST

పదేళ్లకు పూర్తైన అటల్‌ టన్నెల్‌ ..

హిమాచల్‌ప్రదేశ్‌: ప్రపంచంలోని అతిపెద్ద సొరంగ మార్గం (అటల్‌ టన్నెల్‌) ఎట్టకేలకు పూర్తైంది. మనాలి నుంచి లేహ్‌ వరకూ 9.2 కిలోమీటర్లు ఉన్న సొరంగ రహదారి భూమికి 10వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఆరేళ్లలో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పదేళ్లు పట్టింది. లేహ్‌ నుంచి మనాలి 475 కిలోమీటర్లు ఉండగా ఈ రహదారి నిర్మాణం వల్ల 46 కి.మీ. మేర దూరం తగ్గనుంది. దీంతో పాటు ప్రయాణ సమయంలో నాలుగు గంటలు కలిసి రానున్నట్లు ఈ ప్రాజెక్టు ముఖ్య ఇంజినీరు కేపీ పురుషోత్తమన్‌ తెలిపారు. ఈ తొమ్మిది కి.మీ. మార్గంలో ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరాను బిగించారు. వీటితో పాటు ప్రతి 500 మీటర్లకు ఒకచోట అత్యవసర ద్వారం.. అగ్నిప్రమాదాలను నివారించడానికి సొరంగ మార్గమంతటా అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేశారు. రహదారికి ఇరువైపులా మీటరు పుట్‌పాత్ కలిగిన ఈ ప్రాజెక్టును సమష్టి కృషితో విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని