చెన్నైలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్

ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Published : 30 Oct 2020 01:20 IST

చెన్నై: ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెల్లవారుజామున ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడటంతో.. ఎక్కడిక్కడ నీళ్లు నిలిచిపోయి, జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లల్లోకి నీరు చేరిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 

కాగా, చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎంసి) రాబోయే 24 గంటల్లో తమిళనాడులోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రమంతా ఎడతెగని వర్షాలు పడుతున్నందున భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఇప్పటికే ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మరోవైపు..తమిళనాడు, పుదుచ్చేరిలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నగరంలో భారీ వర్షాల కారణంగా చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలవడం, చెట్లు పడిపోవడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో..వాటిని ‘నమ్మ చెన్నై’ యాప్‌లో రిజిస్టర్‌ చేయమని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) పౌరులను కోరింది. అలాగే ప్రజల సహాయార్థం హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. 

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని