Reunite: యవ్వనంలో విడిపోయి.. వృద్ధాప్యంలో ఒక్కటై..

యవ్వనంలో విడిపోయిన ఓ జంట.. వృద్ధాప్యంలో మళ్లీ ఒక్కటైంది. దాదాపు యాభైయ్యేళ్ల క్రితం విడాకులు తీసుకున్న దంపతులు ఇప్పుడు మళ్లీ కలిసి జీవించాలనుకుంటున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో నిర్వహించిన లోక్‌

Updated : 28 Jun 2022 06:52 IST

52 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన దంపతులు

మైసూరు, ఈటీవీ భారత్‌: యవ్వనంలో విడిపోయిన ఓ జంట.. వృద్ధాప్యంలో మళ్లీ ఒక్కటైంది. దాదాపు యాభైయ్యేళ్ల క్రితం విడాకులు తీసుకున్న దంపతులు ఇప్పుడు మళ్లీ కలిసి జీవించాలనుకుంటున్నారు. కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో ఈ వృద్ధ జంటను జడ్జీలు మళ్లీ కలిపారు. బాసప్ప (85), కల్లవ (80) అనే వీరు పెళ్లైన కొద్ది సంవత్సరాలకే మనస్పర్థల కారణంగా 52 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి బాసప్ప ఆమెకు ప్రతినెలా భరణం చెల్లిస్తున్నారు. ఈ మధ్య కొద్ది నెలలుగా ఆయన భరణం ఆపేశారు. దీంతో కల్లవ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఈ కేసును లోక్‌ అదాలత్‌లో పరిష్కారించాలనుకుంది. అయితే న్యాయమూర్తి ఈ వృద్ధ జంటను చూసి కంగుతిన్నారు. ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చారు. దీంతో మళ్లీ కలిసి జీవించేందుకు వారు ఒప్పుకున్నారు. మైసూర్లో విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోవాలనుకున్న మొత్తం 38 జంటలను ఇటీవల ఈ లోక్‌ అదాలత్‌ ద్వారా తిరిగి కలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని