
Mundka Fire: దిల్లీ అగ్నిప్రమాదం.. 50 మందిని రక్షించిన ఆపద్బాంధవుడు
క్రేన్ డ్రైవర్ చాకచక్యంతో తప్పిన మరింత ప్రాణనష్టం
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రమాద సమయంలో ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకోక ముందే ‘ఆపద్బాంధవుడిలా’ వచ్చిన ఓ వ్యక్తి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. నిమిషాల వ్యవధిలో భవనం మొత్తం మంటలు వ్యాపించే సరికే దాదాపు 50 నుంచి 55 మందిని రక్షించారు. అయితే, మంటలు మరింత తీవ్రమయ్యేసరికి మిగతా వారిని కాపాడలేకపోయానని చెబుతున్న ఆపద్బాంధవుడిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.
ముంద్కా మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ మూడంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమయంలో ముంద్కా ఉద్యోగ్ నగర్‌నుంచి క్రేన్‌తో అటుగా వెళ్తోన్న దయానంద్ తివారీ.. అగ్నిప్రమాదాన్ని గుర్తించారు. క్రేన్ యజమాని, ఓ సహాయకుడుతో సహా వెంటనే భవనం దగ్గరకు చేరుకొని అందులో ఉన్నవారిని రక్షించే కార్యక్రమం మొదలుపెట్టారు. విషయం తెలుసుకొని అగ్ని మాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొనేలోపే స్థానికుల సహాయంతో దాదాపు 50 మంది ప్రాణాలను కాపాడారు. మరింత మందిని కాపాడాలనే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో మిగతావారిని కాపాడలేకపోయానని దయానంద్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భయంకరమైన ఘటనను గుర్తుచేసుకున్న ఆయన.. అగ్నిమాపక యాంత్రాలు గంటన్నర ఆలస్యంగా ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఆరోపించారు.
ఇక ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన దిల్లీ పోలీసులు.. రెండు ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాలిపోయిన మృతుల అవశేషాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించి వాటి ఆధారంగా బాధితులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు.
భవన యజమాని అరెస్టు..
27 మంది మరణానికి కారణమైన దిల్లీ అగ్ని ప్రమాద ఘటనలో భవన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజులుగా పరారీలో ఉన్న యజమాని మనీశ్ లక్రాను దిల్లీ, హరియాణాలో సోదాలు నిర్వహించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది మహిళలు సహా మొత్తం 27 మంది సజీవదహనం కాగా మరో 19 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
IRCTC ఖాతాకు ఆధార్ లింక్ చేయలేదా? లేదంటే ఈ సదుపాయం కోల్పోయినట్లే..!
-
General News
Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
-
Politics News
Pawan Kalyan: జనసేన కౌలురైతు భరోసా నిధికి అంజనాదేవి సాయం.. పవన్‌కు చెక్కు అందజేత
-
India News
Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టు
-
General News
Top Ten news @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Telangana News: టీచర్ల ఆస్తులపై విద్యాశాఖ ఉత్తర్వులు రద్దు చేసిన ప్రభుత్వం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి