Foreign Ministry Driver: వలపు వలలో విదేశాంగ మంత్రిత్వ శాఖ డ్రైవర్‌..!

విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక డ్రైవర్ వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గూఢచర్యం ఆరోపణలపై ప్రస్తుతం అతడిని అరెస్టు చేశారు. 

Published : 19 Nov 2022 02:22 IST

దిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ వద్ద పనిచేస్తోన్న డ్రైవర్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ భవన్‌ నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక పాకిస్థాన్‌ వ్యక్తికి పత్రాలు, సమాచారాన్ని చేరవేస్తున్నాడని, అందుకు బదులుగా డబ్బు తీసుకుంటున్నట్లు ఆ ఆరోపణల సారాంశం. ఆ డ్రైవర్ వలపు వల(Honey Trap)లో చిక్కుకున్నాడని క్రైమ్ బ్రాంచ్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడిని అరెస్టు చేసినట్లు చెప్పాయి. ఆ పాకిస్థాన్‌ వ్యక్తి ఒక మహిళ అని తెలుస్తోంది. పూజ, పూనమ్‌ శర్మ పేర్లతో అతడికి గాలం వేసినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని