Jackky Bhagnani: వివాదంలో చిక్కుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నిర్మాణసంస్థ

ప్రముఖ సినీ నిర్మాత, సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త జాకీ భగ్నానీ వివాదంలో చిక్కుకున్నారు.

Published : 23 Jun 2024 00:03 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ప్రముఖ సినీ నిర్మాత, సినీనటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul preet singh) భర్త జాకీ భగ్నాని(Jackky Bhagnani) నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్‌మెంట్ (Pooja Entertainment) వివాదంలో చిక్కుకుంది. నిర్మాణ సంస్థ తమకు ఇవ్వాల్సిన వేతనాలను చెల్లించట్లేదని సంస్థ సిబ్బంది సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. వారు తీసిన సినిమాకు బడ్జెట్‌ ఎక్కువయినందువల్ల తమకు వేతనాలు చెల్లించలేకపోతున్నామని నిర్మాణ సంస్థ తెలిపినట్లుగా అందులోని ఓ సభ్యురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి చేసిన పనికి చెల్లించాల్సిన జీతాలను ఏడాది కాలంగా ఇవ్వకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారిందని, అందువల్లే ఈ విషయాన్ని బయటకు చెప్పక తప్పట్లేదన్నారు. 

ప్రొడక్షన్ డిజైన్ వర్కర్ అయిన బాధితురాలు రెండేళ్ల క్రితం దాదాపు 100 మంది సిబ్బందితో కలిసి ఓ సినిమాలో పనిచేశానని తెలిపారు. ప్రస్తుతం వారందరూ రెండు నెలల జీతం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌లో పని చేసిన నటీనటులకు వెంటనే డబ్బు చెల్లించిన సంస్థ తమ వద్దకు వచ్చే సరికి సాకులు చెప్తూ వేతనాలు ఇవ్వట్లేదని మండిపడ్డారు. ‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు నాకెప్పుడు వస్తుంది’ అంటూ  ప్రశ్నించారు. 

పూజా ఎంటర్‌టైన్‌మెంట్ చివరిగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ చిత్రాన్ని నిర్మించింది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయాన్ని పొందలేకపోయింది. మిషన్ రాణిగంజ్, జవానీ జానేమాన్, బెల్ బాటమ్ అనేక ఇతర చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని