divorce: విడాకుల అంశంపై కేరళ హైకోర్టు కీలక తీర్పు

విడాకుల అంశంలో కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో విడాకుల( Divorce) కోసం దరఖాస్తు చేసుకునే ముందు కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలన్న క్రైస్తవ వివాహ చట్టం 1869లోని నిబంధనను కొట్టి వేసింది.

Published : 09 Dec 2022 23:37 IST

కొచ్చి: విడాకుల అంశంపై కేరళ హైకోర్టు(kerala Highcourt) కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో విడాకుల( Divorce) కోసం దరఖాస్తు చేసుకునే ముందు కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలన్న క్రైస్తవ వివాహ చట్టం 1869లోని నిబంధనను తాజాగా కొట్టి వేసింది. గతంలో ఈ వ్యవధి రెండేళ్లు ఉండేది. అయితే, విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే భార్యాభర్తలు ఏడాది పాటు విడిగా ఉంటే సరిపోతుందని 2010లో నిబంధనలను సవరించిన ఇదే న్యాయస్థానం తాజాగా దాన్ని కూడా కొట్టివేయడం గమనార్హం. విడాకుల కోసం దరఖాస్తు చేసే ముందు దంపతులు కచ్చితంగా విడిగా ఉండాలన్న నిబంధన విడాకులను నియంత్రించే విధంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భార్యాభర్తలు ఎప్పుడైనా విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. కానీ, క్రైస్తవ వివాహ చట్టంలో దీనికి తావు లేకపోడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అందుకే ఏడాది వ్యవధి ఉండాలన్న నిబంధనను సైతం కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని