రేషన్‌ కోసం బెంజి కారులో వచ్చిన ‘పేదవాడు’.. వీడియో వైరల్‌

పేద ప్రజల కోసం ప్రభుత్వాలు అందించే రేషన్‌ పంపిణీలో జరిగే అవకతవకాలు మరోసారి బయటికొచ్చాయి. ఓ వ్యక్తి రేషన్‌ దుకాణంలో సరుకులు

Updated : 06 Sep 2022 16:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేద ప్రజల కోసం ప్రభుత్వాలు అందించే రేషన్‌ పంపిణీలో జరిగే అవకతవకలు మరోసారి బయటికొచ్చాయి. ఓ వ్యక్తి రేషన్‌ దుకాణంలో సరకులు తీసుకునేందుకు ఏకంగా బెంజి కారులో వచ్చిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

హోషియార్‌పుర్‌లోని ఓ ప్రభుత్వ రేషన్‌ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగి నేరుగా రేషన్ దుకాణంలోకి వెళ్లాడు. తన బీపీఎల్‌(Below Poverty Line) కార్డు చూపించి సరకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ సంచులను కారు డిక్కీలో పెట్టించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి రేషన్‌ దుకాణం నుంచి కారులో సరకులు తీసుకెళ్తోన్న వీడియోను కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది.

సదరు రేషన్‌ దుకాణాన్ని అమిత్‌ కుమార్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ వీడియో వైరల్‌ అవడంతో స్థానిక మీడియా విలేకరులు అమిత్‌ను ప్రశ్నించారు. అయితే ఆ వ్యక్తికి బీపీఎల్‌ కార్డు ఉందని.. తాను కేవలం ఆ కార్డును పరిశీలించిన తర్వాతే రేషన్ ఇచ్చానని తెలిపారు. అతడు కారులో వచ్చిన విషయం తనకు తెలియదన్నారు.

అయితే ఈ వీడియో కాస్తా తీవ్ర వివాదానికి దారితీయడంతో ఆ బెంజి కారులో వచ్చిన వ్యక్తి స్పందించాడు. ఆ కారు తమ బంధువులదని, వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి ముందు పార్క్‌ చేసి వెళ్లారని చెప్పాడు. అందుకే అప్పుడప్పుడు ఆ కారును తాను ఉపయోగిస్తున్నానని తెలిపాడు. తాను పేద వ్యక్తినే అని, డబ్బుల్లేక తమ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నట్లు చెప్పడం గమనార్హం.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts