Lata Mangeshkar: గాన కోకిల పుట్టిన నగరంలో సంగీత అకాడమీ.. మ్యూజియం!

దిగ్గజ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల యావత్‌ భారతదేశం సంతాపం వ్యక్తం చేసింది. తాజాగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూనే

Published : 08 Feb 2022 01:25 IST

ఇండోర్‌: దిగ్గజ గాయని, భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ ఆదివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల యావత్‌ భారతదేశం సంతాపం వ్యక్తం చేసింది. తాజాగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌.. లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తు ఆమె గౌరవార్థం రాష్ట్రంలో సంగీత అకాడమీ, సంగీత పాఠశాల, మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 

‘‘లతా మంగేష్కర్‌ పుట్టింది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోనే. అందుకే, ఆమె గౌరవార్థం ఇక్కడ సంగీతం నేర్చుకునే పిల్లల కోసం ఒక అకాడమీ ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు సంగీత పాఠశాల, మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అవి ఎలా ఉండాలనే దాని గురించి ఇతర సంగీత విధ్వాంసులతో సంప్రదింపులు జరుపుతాం. ఇండోర్‌లో ఆమె విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే, ఇకపై ఏటా లతా మంగేష్కర్‌ జయంతి రోజున ఆమె పేరు మీద అవార్డు ప్రదానం చేస్తాం’’అని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు.

లతా మంగేష్కర్‌ 1929 సెప్టెంబర్‌ 29న ఇండోర్‌లో జన్మించారు. ఆమె టీనేజ్‌లో ఉండగా తండ్రి దీననాథ్‌ మంగేష్కర్‌ మృతి చెందారు. దీంతో ఆమె కుటుంబం ముంబయి వలస వెళ్లి అక్కడే స్థిరపడింది. మరాఠీ సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్‌ను ప్రారంభించిన లతా మంగేష్కర్‌.. భారతదేశ గాన కోకిల అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారు. 2001లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు పొందారు. 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని