CoronaVaccine:అవగాహనకు ‘టీకా విమానం’

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా ప్రతిరోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొవిడ్‌ కేసుల ఉద్ధృతికి ప్రజల అజాగ్రత్తే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల్లో టీకాపై భయాలున్నాయని....

Published : 07 May 2021 11:40 IST

సూరత్‌: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొవిడ్‌ కేసుల ఉద్ధృతికి ప్రజల అజాగ్రత్తే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల్లో టీకాపై భయాలున్నాయని.. ఆ భయాలను తొలగించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  గుజరాత్‌లోని సూరత్‌ కార్పొరేషన్‌ వినూత్న అవగాహనకు శ్రీకారం చుట్టింది. సిటీలోని అత్వాగేట్‌ సర్కిల్‌ వద్ద విమానం ఆకారంలో భారీ వ్యాక్సిన్‌ నమూనాను ఏర్పాటుచేసింది. టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన భారీ ‘టీకా విమానం’ బొమ్మ విశేషంగా ఆకట్టుకుంటోంది. మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేసుకోవాలంటూ ఆ బొమ్మ సూచిస్తోంది.

సూరత్‌లో మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయసు నుంచి 45 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కావడంతో టీకా వేసుకునేందుకు యువత ముందుకొస్తోంది. అయితే ప్రస్తుతం సూరత్‌లోని చాలా ప్రాంతాల్లో టీకా కొరత ఏర్పడింది. ఈ కొరతను తీర్చాలని పలువురు కోరుతున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం టీకా విమానం బొమ్మ ఏర్పాటు చేయడం అభినందించాల్సిన విషయమని, టీకా కొరతను తీర్చి అందరికీ త్వరితగతిన వ్యాక్సిన్‌ అందించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అక్కడి యువత అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని