Rolls Royce: యువకుడి నైపుణ్యం.. మారుతి కారుని రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు

కేరళ (Kerala)కు చెందిన ఓ యువకుడి తక్కువ ఖర్చుతో మారుతీ 800ను రోల్స్‌ రాయిస్‌ తరహా కారుగా మార్చేశాడు.  

Updated : 03 Oct 2023 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు బీఎమ్‌డబ్ల్యూ, రోల్స్‌ రాయిస్‌ వంటి లగ్జరీ కార్లలో తిరగాలని ఆశపడుతుంటారు. వీటి ధర ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తుంటారు. కానీ, ఓ యువకుడు అతి తక్కువ ఖర్చుతో రోల్స్‌ రాయిస్‌ తరహా కారు (Rolls Royce)ను స్వయంగా తయారు చేశాడు. ఇంతకీ అది ఎలా సాధ్యమైందంటే..

కేరళ (Kerala)కు చెందిన 18 ఏళ్లు హదీఫ్ అనే యువకుడు తన నైపుణ్యాలతో రోల్స్‌ రాయిస్‌ తరహా కారును రూపొందించాడు. అతడికి సాధారణ కార్లను లగ్జరీ కార్లగా మార్చేడంపై ఉన్న ఆసక్తితోనే ఇది సాధ్యమైంది. మారుతీ 800 (Maruti 800) కారును లగ్జరీ కారుగా మార్చి ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందుకోసం కొన్ని నెలల పాటు తీవ్రంగా శ్రమించాడు. కేవలం రూ. 45 వేలతో రోల్స్‌ రాయిస్‌ తరహా కారును రూపొందించారు.

కొత్తగా ఆవిష్కరించిన ఈ కారుకు ఉన్న అద్దాలు, చక్రాలు, హెడ్‌లైట్స్‌ సహా వివిధ భాగాలను అందంగా మలిచాడు. దీనిపై ఉన్న లోగోను స్వయంగా అతడే రూపొందించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. యూట్యూబ్‌లో ఉన్న ఈ వీడియోను దాదాపు మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. ఇదిలా ఉండగా.. గతంలో హదీఫ్‌ మోటార్‌ సైకిల్‌ ఇంజిన్‌ను ఉపయోగించి జీప్‌ వాహనాన్ని రూపొందించడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు