అశ్లీల దృశ్యాలు చూస్తూ.. వివాదంలో ఎమ్మెల్యే..!
ప్రజల సమస్యలు వినిపించాల్సిన చట్టసభలో ఓ భాజపా ఎమ్మెల్యే అనైతిక చర్యకు పాల్పడ్డారు. అభ్యంతరకర దృశ్యాలు(porn clips)చూస్తూ కాలక్షేపం చేస్తోన్న ఆయన తీరు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అగర్తల: అసెంబ్లీ వేదికగా అశ్లీల దృశ్యాలు( porn clips) చూస్తూ అడ్డంగా దొరికిపోయారు ఓ భాజపా ఎమ్మెల్యే(Tripura BJP MLA). ఒకవైపు సభ కార్యకలాపాలు నడుస్తుండగా..ఆయన ఫోన్ చూస్తున్న చిత్రాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రజల గళం వినిపించే ప్రదేశంలో ఆ నేత వ్యవహరించిన తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సదరు ఎమ్మెల్యే పేరు జాదవ్ లాల్‌నాథ్. ఆయన త్రిపుర(Tripura)లోని బాగ్‌బస్సా నియోజకవర్గానికి (Bagbassa constituency)ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సభ కార్యకలాపాలు జరుగుతోన్న సమయంలో ఆయన అభ్యంతరకర వీడియోలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సభలో రాష్ట్రబడ్జెట్ గురించి చర్చిస్తున్నారు. అయితే జాదవ్ వెనక కూర్చున్నవారు ఆయన వ్యవహారాన్ని చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే ప్రవర్తన భాజపాను ఇరకాటంలో పడేసింది. దీనిపై పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు, ఆయన్ను వివరణ కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వీడియోల దుమారంపై ప్రస్తుతానికి ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
ఇలా చట్టసభలో అసభ్య దృశ్యాలు( porn clips)చూస్తూ పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. 2012లో కర్ణాటక అసెంబ్లీలో భాజపా ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు అశ్లీల దృశ్యాలు చూస్తూ దొరికిపోయారు. దాంతో వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేయాల్సివచ్చింది. అయితే విచారణలో వారు ఎలాంటి తప్పు చేయలేదని తేలడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం