‘కో-విన్‌’కు ఆధార్‌ తప్పనిసరికాదు: కేంద్రం

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉద్దేశించి ఏర్పాటు చేసిన కో-విన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ తప్పనిసరి కాదని కేంద్ర......

Updated : 29 Feb 2024 14:06 IST

దిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉద్దేశించి ఏర్పాటు చేసిన కో-విన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వనీ చౌబే లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ పోర్టల్‌ను యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (యూఎన్‌డీపీ) సహకారంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిందన్నారు. కో-విన్‌ యాప్‌లోనూ రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ తప్పనిసరికాదని పేర్కొన్నారు. ఈ పోర్టల్‌లో ఫిబ్రవరి 1 వరకు 58.90 లక్షల మంది నమోదు చేసుకున్నారని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి..

నిమిషాల వ్యవధిలో ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని