Delhi: 75 ఏళ్ల స్వాతంత్ర్యం.. దిల్లీలో 75 జాతీయ జెండాల ఏర్పాటుకు కేజ్రీవాల్‌ నిర్ణయం

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశరాజధాని దిల్లీలో 75 జాతీయ జెండాలను ఏర్పాటు

Published : 27 Jan 2022 18:13 IST

దిల్లీ: భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశరాజధాని దిల్లీలో 75 జాతీయ జెండాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 75 స్వాతంత్ర దినోత్సవం నాటికి.. దిల్లీలోని 75 ప్రాంతాల్లో 115 అడుగుల మువ్వన్నెల జెండాలను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. దిల్లీలో మెుత్తం 500 ప్రాంతాల్లో త్రివర్ణపతాకం ఎగరాలని.. ప్రతీ ఒక్కరూ రోజులో 2, 3 సార్లు జాతీయ జెండాను చూడాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. ప్రస్తుత జీవన విధానంలో దేశాన్ని, సమాజాన్ని మరచిపోతున్నామని.. ఈ జెండాలు ప్రతిఒక్కరిలో దేశభక్తిని పెంపొందిస్తాయని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని