Punjab cabinet: డాక్టర్‌, లాయర్‌, ధాన్యం మార్కెట్‌ ఏజెంట్‌..!

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం తర్వాత.. ఇప్పుడు మంత్రివర్గంపైనే అందరి దృష్టి ఉంది.

Updated : 19 Mar 2022 16:27 IST

పంజాబ్‌ ప్రభుత్వంలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

చండీగఢ్‌: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం తర్వాత.. ఇప్పుడు మంత్రివర్గంపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్ ప్రమాణ స్వీకారం చేయగా.. శనివారం 10 మంది మంత్రులు కొలువుదీరారు. వీరంతా చండీగఢ్‌లోని రాజ్‌ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిసి 18 మంది మంత్రులు ఉండొచ్చు. 

కొలువుదీరిన మంత్రులెవరంటే..

* హర్పాల్‌ సింగ్ చీమా: ఆప్‌లో ప్రముఖ దళిత నేత. దిర్బా నుంచి తిరిగి విజయం సాధించారు. పార్టీ ప్రారంభం నుంచి కొనసాగుతున్నారు.

* డాక్టర్ బల్జిత్ కౌర్: ఆప్‌ మాజీ ఎంపీ సాధు సింగ్ కుమార్తె. మలౌత్ నుంచి  గెలుపొందారు. 

* హర్భజన్ సింగ్ ఈటీఓ: 2017లో ఆప్‌లో చేరి, తాజాగా జాండియాలా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయాల్లో చేరేందుకు  ఎక్సైజ్ విభాగంలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

* డాక్టర్ విజయ్ సింగ్లా: దంతవైద్యుడు. ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి సిద్దు మూసేవాలాను ఓడించారు. 

* లాల్‌చంద్‌ కటారుచక్‌: సామాజిక కార్యకర్త. భోవా(BHOA) నుంచి విజయం సాధించారు.

* గుర్మీత్‌ సింగ్ మీట్ హయర్: బర్నాలా నుంచి ఎంపికైన ఈ యువ ఎమ్మెల్యే.. గతంలో అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత ఆప్‌లో చేరారు. 

* కుల్‌దీప్ సింగ్ ధలివాల్‌: అజ్నాలా ఎమ్మెల్యే. ఈయనపై హత్య కేసు నడుస్తోంది. 

* లలిత్‌ సింగ్ భుల్లార్‌: ధాన్యం మార్కెట్‌లో ఏజెంట్‌గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ అల్లుడు ప్రతాప్‌ సింగ్ కైరోన్‌పై విజయం సాధించారు.

* బ్రామ్ శంకర్‌: విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న శంకర్..హోషియార్‌పూర్‌ నుంచి గెలిచారు.

* హర్జోత్‌ సింగ్ బెయిన్స్‌: శ్రీ ఆనంద్‌పూర్ సాహిబ్‌లో పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ రాణా కేపీ సింగ్‌ను ఓడించారు. లాయర్‌. పార్టీ యువ విభాగం అధ్యక్షుడు.    


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని