IN PICS: ఘనంగా ఎంపీ రాఘవ్‌ చద్దా, పరిణీతి చోప్రా నిశ్చితార్థం.. ప్రముఖుల హాజరు

ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, సినీ నటి పరిణీతి చోప్రా నిశ్చితార్థ వేడుక దిల్లీలో ఘనంగా జరిగింది. 150మంది అతిథుల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.

Updated : 13 May 2023 22:10 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (APP) ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha), బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) ప్రేమలో ఉన్నారంటూ వస్తోన్న రూమర్లకు నేటితో తెరపడింది. శనివారం రాత్రి సెంట్రల్‌ దిల్లీలోని కపుర్తలా హౌస్‌లో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు సహా దాదాపు 150 మంది అతిథులు సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకొని వైవాహిక బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమైంది. తమ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను రాఘవ్‌, పరిణీతి ఇద్దరూ తమ ఇన్‌స్టా ఖాతాల్లో షేర్‌ చేసుకున్నారు. త్వరలో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ వేడుకకు దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, పరిణీతి సోదరి సినీనటి ప్రియాంకా చోప్రా జోనాస్‌, కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరిక్‌ ఓబ్రెయిన్‌ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రియాంక ఈ రోజు ఉదయమే అమెరికా నుంచి వచ్చారు. పసుపురంగు చీరలో ప్రియాంక మెరిశారు. నిశ్చితార్థ వేడుక సందర్భంగా ముంబయిలో పరిణీతి చోప్రా నివాసం, దిల్లీలోని రాఘవ్‌ చద్దా ప్రభుత్వ భవనాలను ప్రత్యేకంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు