AAP: పాలు, పెట్రోల్‌ పోటీ పడుతున్నాయా..?

ఈ రోజు అమూల్‌ పాల ధరలు లీటర్‌కు రెండు రూపాయల చొప్పున పెరిగాయి. ఉదాసీనంగా వ్యహరిస్తోన్న ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు

Published : 15 Oct 2022 16:20 IST

గాంధీనగర్‌: మరోసారి అమూల్‌ పాల ధరల (Amul milk price)పెంపుపై ఆమ్ ఆద్మీ పార్టీ((AAP) స్పందించింది. ధరల పెరుగుదల విషయంలో పెట్రోల్‌తో పాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. దీనిపై ట్విటర్ వేదికగా భాజపాపై విమర్శలు చేసింది. 

ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌, గేదె పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్‌ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్‌ చేసే గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని తెలిపింది. అమూల్‌ పాల ధరలు పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది మూడోసారి. గతంలో ఈ పెరుగుదలకు పాల ప్యాకేజీ, రవాణా, పశుగ్రాసం వ్యయాలను కారణంగా చూపింది. దీనిపై ఆప్‌ ఎంపీ రాఘవచద్దా ట్వీట్‌ చేశారు. ‘మీకు చెప్పాను కదా..! ధరల విషయంలో పాలు, పెట్రోల్‌ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. ఈ రోజు అమూల్‌ పాల ధరలు లీటర్‌కు రెండు రూపాయల చొప్పున పెరిగాయి. ఉదాసీనంగా వ్యహరిస్తోన్న ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు’ అని భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని