ఆక్స్‌ఫర్డ్‌ హిందీ పదంగా ‘ఆత్మనిర్భరత’

దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆత్మనిర్భరత’ పదం 2020 ఏడాదికి గానూ ఆక్స్‌ఫర్డ్‌ హిందీ పదంగా నిలిచింది....

Updated : 03 Feb 2021 04:41 IST

దిల్లీ: దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆత్మనిర్భరత’ పదం 2020 ఏడాదికి గానూ ఆక్స్‌ఫర్డ్‌ హిందీ పదంగా నిలిచింది. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం సహా ఎంతోమంది భారతీయుల రోజువారీ విజయాలను ఆత్మనిర్భరత  ధ్రువీకరించిందని ఆక్స్‌ఫర్డ్‌ తెలిపింది. దీని ఫలితంగానే ఆత్మనిర్భరతను 2020 ఏడాదికి గానూ హిందీ పదంగా ఎంపిక చేసినట్లు ఆక్స్‌ఫర్డ్‌ సలహా ప్యానెల్‌ సభ్యులు వెల్లడించారు. ఇది కేవలం పదం మాత్రమే కాక గడిచిన సంవత్సరంలో దేశ నైతికత, మానసిక స్థైర్యం, ముందుచూపును ప్రతిబింబించిందని సభ్యులు పేర్కొన్నారు. కరోనా ఉపశమన ప్యాకేజీ సందర్భంగా ప్రధాని మోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆవశ్యకతను వివరించారన్న ఆక్స్‌ఫర్డ్‌ అప్పటినుంచి ఆత్మనిర్భరత పదం ప్రజా క్షేత్రంలో వాడుక పదంగా మారిపోయిందని పేర్కొంది.

ఇవీ చదవండి...

మరింత తగ్గిన పసిడి ధర

సీబీఎస్‌ఈ 10,12వ తరగతి పరీక్ష తేదీలివే..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని