భారత్‌లో భయానక పరిస్థితులు: ఆంటోనీ ఫౌచీ

కరోనా వైరస్‌ విషయంలో భారత్‌ ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటోందని అమెరికా వైద్య విభాగం ఉన్నత సలహాదారు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.

Published : 24 Apr 2021 13:58 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ విషయంలో భారత్‌ ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటోందని అమెరికా వైద్య విభాగం ఉన్నత సలహాదారు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు తాము ఏవిధంగానైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  

‘భారత్‌ ప్రస్తుతం అత్యంత భయంకర పరిస్థితులు ఎదుర్కొంటోంది. భారత్‌కు ఏవిధంగానైనా సాయం చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. నిన్న ఆ దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. భారత్‌లో క్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి అమెరికాకు చెందిన సీడీసీ అక్కడి సంబంధిత విభాగంతో కలిసి సాంకేతికంగా సహకారం, సహాయాన్ని అందించేందుకు పనిచేస్తోంది. ఆ దేశంలో కొత్త వేరియంట్లు విజృంభిస్తున్నాయి. వాటిపై వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావం చూపిస్తాయనేది చెప్పలేం. కానీ ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ఫౌచీ తెలిపారు. 

కాగా, భారత్‌లో గడిచిన 24 గంటల్లో 3,46,786 కేసులు నమోదయ్యాయి. మరో 2,624 మంది మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు వదిలారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు