Published : 10 Apr 2022 01:23 IST

guchhi: పుట్టగొడుగులే.. కేజీ ధర మాత్రం రూ.18000..

సిమ్లా: గుచ్చి అనగానే సాధరణంగా ఎవరికైనా గుర్తొచ్చేది అందమైన, అలంకారప్రాయమైన బ్రాండ్‌డ్‌ హ్యండ్‌ బ్యాగ్స్‌... ఇలా అనుకుంటే మీరు పొరపడినట్లే.. హిమాచల్‌ అటవీ ప్రాంతాల్లో పెరిగే అత్యంత ఖరీదైన, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్న పుట్టగొడుగులు. విటమిన్స్‌, మినరల్స్‌, యాంటీ ఆక్స్‌డెంట్స్‌ మెండుగా ఉన్న వీటిని తింటే గుండె జబ్బులు మధుమేహ వ్యాధులకు చెక్‌ పెట్టినట్లే... కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇవి హిమాచల్‌ అడవుల్లో కరవయ్యాయి. వీటి కథాకమామీషు తెలుసుకుందాం పదండి... 

వీటి లభ్యత ఎక్కడ...

భారతదేశంలోని జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల్లో సముద్రమట్టానికి ఎత్తైన ప్రాంతాల్లో గుచ్చి లభ్యమవుతుంది. ఇది మోర్చరిల్లా కుటుంబానికి చెందిన తినదగిన అరుదైన శిలీంద్రాల్లో ఒకటి. వృక్షశాస్రంలో మోర్చెల్లా ఎస్కులెంటా అని పిలుస్తారు. జనవరి నుంచి జూన్‌ వరకూ పెరుగుతాయి. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వీటి లభ్యత తగ్గిపోతుంది. ఇవి అడవిలో సహజంగా పెరుగుతాయి. కృతిమంగా సాగు చేయలేం. మంచు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చిన తరువాత వీటి ఎదుగుదల మొదలవుతుందని అక్కడి వారు చెబుతున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు...

ఏ వయసు వారైనా రక్త పరీక్షలు చేయించుకుంటే ఇప్పుడు సాధారణంగా కనిపిస్తున్న సమస్య విటమిన్‌ డి, బీ12 లోపం. వీటిని అధిగమించడానికి ఎన్ని మందులు వాడుతున్నా లాభంలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుచ్చి పుట్టగొడుగులు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చని వైద్యనిపుణులు వెల్లడించారు. రక్త హీనత, ఎముకలు గుళ్ల పడటం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తోంది. మల్టీ విటమిన్‌ మాత్రలకు బదులుగా ప్రకృతిలో లభించే మందు ఇది.

దేశంలోనే అత్యంత ఖరిదైన పుట్టగొడుగు...

మోర్చెల్లా గుచ్చి 1000 గ్రాముల ఖరీదు రూ.18 వేలు. మూడు, నాలుగు సంవత్సరాల నుంచి దీని లభ్యత తగ్గిందని సిమ్లా వాసులంటున్నారు. లాక్‌డౌన్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ చుట్టుపక్కల చాలా గిరిజన కుటుంబాలు దీన్ని జీవనోపాధిగా మలచుకున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా భూమిలో తేమ తగ్గి వీటి లభ్యత తగ్గింది. రోజులో ఆరేడు గంటలు వేట సాగిస్తే కనీసం వంద గ్రాములు కూడా దొరకడం లేదని  వాపోతున్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని