Godhra Train Burning Case: 2002 గోద్రా రైలు దహనం కేసులో నిందితుడికి జీవిత ఖైదు

గోద్రాలో రైలు బోగీలకు నిప్పు పెట్టి 59 మంది కరసేవకుల మరణానికి కారణమైన కేసులో నిందితుడు రఫీక్‌ భతూక్‌కు జీవిత ఖైదు విధించారు. ఈ మేరకు పంచమహల్‌ జిల్లాలోని గోద్రా అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి

Published : 03 Jul 2022 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గోద్రాలో రైలు బోగీలకు నిప్పు పెట్టి 59 మంది కరసేవకుల మరణానికి కారణమైన కేసులో నిందితుడు రఫీక్‌ భతూక్‌కు జీవిత ఖైదు విధించారు. ఈ మేరకు పంచమహల్‌ జిల్లాలోని గోద్రా అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. రఫీక్‌ను 2021లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడిపై విచారణను వేగవంతం చేశారు.

2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి కరసేవకులతో తిరిగి వస్తున్న రైలుకు గోద్రా స్టేషన్‌లో దుండగులు నిప్పుపెట్టారు. ఈ కేసులో రఫీక్‌ నిందితుడు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌ చరిత్రలోనే దారుణమైన మతఘర్షణలు చోటు చేసుకొన్నాయి. వీటిల్లో దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. రైలు దహనం కేసులో ఇప్పటి వరకు న్యాయస్థానం 35 మంది నిందితులకు శిక్ష విధించింది. 2011లో స్పెషల్‌ సిట్‌ కోర్టు 31 మంది నిందితులను  దోషులుగా తేల్చింది. వారిలో 11 మందికి మరణ శిక్ష విధించగా.. 20 మందికి జీవిత ఖైదు విధించారు. 2016లో 11 మరణశిక్షలను గుజరాత్‌ హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. ఆ తర్వాత ఈ కేసులో మరో ముగ్గురికి జీవిత ఖైదు విధించారు.

పంచమహల్‌కు చెందిన ప్రత్యేక ఆపరేషన్ల గ్రూప్‌ పోలీసులు గతేడాది ఫిబ్రవరిలో రఫీక్‌ను గోద్రాలో అరెస్టు చేశారు. 2002లో రైలు దహనం తర్వాత రఫీక్‌ పేరు బయటకు రావడంతో అతడు గోద్రాను వదిలి పారిపోయాడు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో దాక్కొని గతేడాది తిరిగి గోద్రాకు వచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు