India Corona: దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్‌ కేసులు

దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 16,103 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి....

Updated : 03 Jul 2022 11:32 IST

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 16,103 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,35,02,429 చేరింది. వీటిలో క్రియాశీలక కేసుల సంఖ్య 1,11,711గా ఉంది. నిన్న మరో 31 మంది మరణించడంతో మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,25,199కి పెరిగింది. అదే సమయంలో రికవరీ రేటు 98.54 శాతంగా నమోదైంది.

గత 24 గంటల వ్యవధిలో 2,143 క్రియాశీలక కేసులు పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.27 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 3.81 శాతంగా నమోదైంది. మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,28,65,519 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. మరోవైపు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 197.95 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని పంపిణీ చేశారు.

కొత్తగా నమోదైన 31 మరణాల్లో 14 కేరళ నుంచి; మహారాష్ట్రలో ఐదు; పశ్చిమ బెంగాల్‌లో మూడు; దిల్లీ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మిజోరంలో రెండు చొప్పున మరణాలు సంభవించాయి. కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని