India Corona: 10,000 దాటిన క్రియాశీల కేసులు.. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం

దేశంలో కరోనా(Coronavirus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. క్రియాశీల కేసులు 10వేలకు పైగా నమోదయ్యాయి.

Published : 27 Mar 2023 11:27 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) గుబులు ఇంకా తొలగిపోలేదు. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 56,551 మందిని పరీక్షించగా..1,805 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కూడా ఇదేస్థాయి(1,890)లో కేసులు వచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉంది. 

కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు(Active Covid cases) 10వేల మార్కు దాటాయి. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. నిన్న ఆరుగురు మరణించారు. ఇప్పటివరకూ 4.47 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని