India Corona Update: 43,994కు తగ్గిన క్రియాశీలక కేసులు

భారత్‌లో ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,777 కరోనా కేసులు నమోదయ్యాయి....

Published : 25 Sep 2022 11:05 IST

దిల్లీ: భారత్‌లో ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,777 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశంలో నిర్ధారణ అయిన కేసుల సంఖ్య 4,45,68,114కు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 43,994కు తగ్గింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వివరాలను వెల్లడించింది.  

కొత్తగా మహమ్మారి మూలంగా మరో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,28,510కి చేరింది. గతంలో లెక్కలోకి రాని 11 మరణాలను తాజాగా కేరళ గణాంకాల్లో చేర్చింది. వాటిని కూడా కలుపుకొని గత 24 గంటల్లో మరణాల సంఖ్యను కేంద్రం 23గా పేర్కొంది. రివకరీ రేటు 98.72 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో క్రియాశీలక కేసుల వాటా 0.10 శాతం. గత 24 గంటల్లోనే 442 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.58 శాతంగా ఉంది. వారం రోజుల పాజిటివిటీ రేటు 1.63 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు 4,39,95,610 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 217.56 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని