Updated : 25 Jun 2022 22:18 IST

Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ అరెస్టు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌(Teesta Setalvad)ను గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌(ఏటీఎస్‌) శనివారం ముంబయిలో అదుపులోకి తీసుకుంది. మొదట ఆమెను ఇక్కడి శాంతాక్రూజ్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన అధికారులు.. అనంతరం అరెస్టు చేసి అహ్మదాబాద్‌కు తీసుకెళ్తున్నారు. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల(Gujarat riots) విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై తీస్తాతోపాటు రిటైర్డ్‌ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌లపై తాజాగా అహ్మదాబాద్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసులోనే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు గుజరాత్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు.. ఆర్బీ శ్రీకుమార్‌ను గాంధీనగర్‌లో అరెస్టు చేశారు.  సంజీవ్‌ భట్‌ ఓ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

Also Read: గుజరాత్‌ హింస.. పునర్విచారణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

గుజరాత్‌ అల్లర్ల వెనుక భారీ కుట్ర కోణం ఉందని, దీనిపై పునర్విచారణ జరిపించాలని కోరుతూ నాటి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్‌ దివంగత ఎంపీ ఎహ్‌సాన్‌ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీస్తా సెతల్వాద్‌ రెండో పిటిషనర్‌గా ఉన్నారు. నిత్యం వివాదం రగులుతూ ఉండేలా దురుద్దేశపూర్వకంగా పిటిషన్లు వేశారని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా మండిపడింది. విచారణ ప్రక్రియ దుర్వినియోగంలో భాగస్వాములైనవారందరిపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఆమెను అరెస్టు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సైతం శనివారం ఉదయం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. గుజరాత్ అల్లర్లపై తీస్తాకు చెందిన ఎన్‌జీవో.. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని