Actor Darshan: ఆధారాలు మాయం చేసేందుకు అప్పు తెచ్చి మరీ సొమ్ములు సిద్ధం: హత్య అనంతరం దర్శన్‌ హడావుడి

అభిమానిని హత్య చేసిన అనంతరం దర్శన్‌ ఆధారాలు మాయం చేసేందుకు భారీ మొత్తాన్ని సిద్ధం చేసుకొన్నట్లు దర్యాప్తులో గుర్తించారు.  

Published : 21 Jun 2024 14:13 IST

ఇంటర్నెట్‌డెస్క్: అభిమాని రేణుకాస్వామి(Darshan)ని హత్య చేసిన అనంతరం హడావుడిగా ఆధారాలను మాయం చేసేందుకు సినీనటుడు దర్శన్‌ తీవ్రంగా యత్నించినట్లు తేలింది. ఈ క్రమంలో అతడు తెలిసినవాళ్ల వద్ద రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జూన్‌ 9వ తేదీన బెంగళూరులోని ఓ ఫ్లైఓవర్‌ వద్ద మృతదేహం బయటపడంతో 11వ తేదీన దర్శన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే రేణుకాస్వామి మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30 లక్షలు చెల్లించినట్లు దర్శన్‌ అంగీకరించాడు. 

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అతనివద్దనున్న రూ.40 లక్షల నగదును సీజ్‌ చేశారు. దర్శన్‌ మిత్రుడు మోహన్‌రాజు నుంచి ఈ మొత్తం అప్పుగా తీసుకొన్నట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించిన చట్టపరమైన ఇబ్బందులను తొలగించేందుకు, సాక్ష్యాలను మాయం చేసేందుకు వీలుగా దీనిని కొందరికి చెల్లించేందుకు అతడు తీసుకొన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు ఈ విషయాన్ని కూడా దర్శన్‌ రిమాండ్‌ అప్లికేషన్‌లో రాశారు. ఈ కేసులో జోక్యం చేసుకోవాలని పలువురిని అతడు కోరినట్లు అధికారులు గుర్తించారు.  

దర్శన్‌, మరో ముగ్గురి పోలీస్‌ కస్టడీని గురువారం మూడు రోజులపాటు పొడిగించిన విషయం తెలిసిందే. నటి పవిత్రగౌడ సహా 13 మందిని 14 రోజులపాటు జ్యూడీషియల్‌ రిమాండ్‌కు పంపించారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులను గుర్తించారు. ఈ కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పి.ప్రసన్నకుమార్‌ను నియమించింది. గతంలో ఆయన సీబీఐకి సేవలు అందించారు. 2018లో ఈడీ కూడా ఆయన సేవలను వాడుకొంది. ఈ ఏడాది ఎన్‌ఐఏ సంస్థకు ఎస్‌పీపీగా నియమించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని