5G Network: 5జీ టెక్నాలజీపై హైకోర్టుకు నటి

Juhi Chawla: దేశంలో 5జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా నటి, పర్యావరణ కార్యకర్త జుహీ చావ్లా కోర్టును ఆశ్రయించారు. మానవాళితో పాటు జంతు, వృక్షజాలాలపై 5జీ రేడియేషన్‌ ప్రభావం చూపుతుందని పేర్కొంటూ దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Published : 31 May 2021 22:50 IST

దిల్లీ: దేశంలో 5జీ సేవల ఏర్పాటుకు వ్యతిరేకంగా నటి, పర్యావరణ కార్యకర్త జుహీ చావ్లా కోర్టును ఆశ్రయించారు. మానవాళితో పాటు జంతు, వృక్షజాలాలపై 5జీ రేడియేషన్‌ ప్రభావం చూపుతుందని పేర్కొంటూ దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్‌ సి హరిశంకర్‌ ముందుకు ఈ వ్యాజ్యం రాగా.. మరో బెంచ్‌కు కేసును బదిలీ చేశారు. జూన్‌ 2న దీనిపై విచారణ జరగనుంది.

దేశంలో 5జీ సేవలు ఒకసారి అందుబాటులోకి వస్తే ఏ ఒక్క మనిషి గానీ, జంతువుగానీ, పక్షి గానీ, ప్రాణి గానీ దాన్నుంచి వెలువడే రేడియేషన్‌ ప్రభావం నుంచి తప్పించుకోలేవని నటి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఇప్పుడున్న రేడియేషన్‌ 10 నుంచి 100 రెట్లకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 5జీ రేడియేషన్‌ మనుషులపై దీర్ఘకాలం పాటు ప్రభావం చూపడమే కాక.. పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. నటి తరఫున దీపక్‌ ఖోస్లా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పురుషులు, మహిళలు, చిన్నారులు, జంతువులు, ఇలా భూమిపై జీవించే ఏ ఇతర జీవరాశికి 5జీ వల్ల హాని జరగదని ప్రజల ఎదుట నిరూపించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని వ్యాజ్యంలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని