Published : 08 Apr 2022 18:58 IST

Covishield Booster: కొవిషీల్డ్‌ బూస్టర్‌ డోస్‌.. ధర ఎంతంటే..?

క్లారిటీ ఇచ్చిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ చీఫ్‌

దిల్లీ: దేశంలో 18ఏళ్లు నిండిన వారందరికీ ప్రికాషన్‌ డోసు (Booster) తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్‌ పూనావాలా స్వాగతించారు. బూస్టర్‌ డోసు తీసుకోని వారిని చాలా దేశాలు అనుమతించని పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. అయితే, బూస్టర్‌ డోసు వినియోగానికి అనుమతించిన తర్వాత కొవిషీల్డ్‌ డోసు ధర రూ.600 (పన్నులు అదనం)కే అందుబాటులోకి తెస్తామన్నారు. దీనితోపాటు కొవావాక్స్‌ బూస్టర్‌ డోసు ధర రూ.900 (పన్నులు అదనం)గా ఉంటుందని ఓ జాతీయ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదర్‌ పూనావాలా వెల్లడించారు.

18ఏళ్లు పైబడిన వారందరికీ ఏప్రిల్‌ 10 (ఆదివారం) నుంచి ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రికాషన్‌ డోసు పంపిణీ చేయనుంది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారందరూ ప్రికాషన్‌ డోసు తీసుకోవచ్చు. తొలి రెండు డోసులు ఏ టీకా తీసుకున్నారో.. ప్రికాషన్‌ డోసు కూడా అదే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ప్రస్తుతమున్న తొలి, రెండు డోసుల పంపిణీ అలాగే కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా 15ఏళ్లు పైబడిన 96శాతం మంది కనీసం ఒక డోసు తీసుకోగా.. 83శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 2.4కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు ప్రికాషన్‌ డోసు (మూడో డోసు) తీసుకోగా..  12-14 ఏళ్ల వారిలో 45 శాతం మందికి తొలి డోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts