Adar Poonawalla: ‘ఆర్నెళ్లలో చిన్నారులకు ‘కొవావాక్స్‌’ టీకా’

భారత్‌లో చిన్నారుల కోసం అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కొవావాక్స్‌’ను ఆరు నెలల్లో విడుదల చేస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ టీకా.. మూడేళ్లు, ఆపై వయసున్న పిల్లలపై...

Published : 14 Dec 2021 18:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో చిన్నారుల కోసం అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కొవావాక్స్‌’ను ఆరు నెలల్లో విడుదల చేస్తామని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ టీకా.. మూడేళ్లు, ఆపై వయసున్న పిల్లలపై నిర్వహించిన ట్రయల్స్‌లో మంచి ఫలితాలను కనబర్చినట్లు చెప్పారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్‌లో అదర్ పాల్గొని మాట్లాడారు.

వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరా విషయమై అదర్‌ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా.. అనేక దేశాల స్వీకరణ సామర్థ్యాన్ని అధిగమిస్తోందని అన్నారు. భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌కు మించి సరఫరా ఉన్నట్లు చెప్పారు. ‘అనేక దేశాలు ఇప్పటివరకు తమ జనాభాలో తక్కువ మందికే.. అంటే 10 నుంచి 15 శాతం వరకే టీకాలు వేశాయి. వాస్తవానికి ఇది 60 నుంచి 70 శాతం వరకు ఉండాలి. కానీ, మౌలిక సదుపాయాల కొరత కారణంగా ఈ సమస్య  ఏర్పడుతోంద’ని వివరించారు.

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల నెలవారీ ఉత్పత్తిని తాత్కాలికంగా సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్లు ఇటీవల అదర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నుంచి తగినన్ని ఆర్డర్లు రాకపోవడమే ఇందుకు కారణమన్నారు. ప్రస్తుతం కొవిషీల్డ్‌ ఎగుమతులు కూడా నెమ్మదిగానే ఉన్నాయని, వచ్చే త్రైమాసికంలో పుంజుకునే అవకాశం ఉందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని