Yogi Adityanath: యూపీలో యోగి 2.0.. సీఎంగా ప్రమాణస్వీకారం

ఉత్తర్‌ప్రదేశ్‌లో సరికొత్త చరిత్ర లిఖిస్తూ వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లఖ్‌నవూలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఎకానా స్టేడియంలో

Updated : 25 Mar 2022 18:59 IST

ఈ సారి కూడా ఇద్దరు ఉపముఖ్యమంత్రులు..

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో సరికొత్త చరిత్ర లిఖిస్తూ వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లఖ్‌నవూలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఎకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌.. యోగితో ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, స్మృతి ఇరానీ, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితర పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. 

గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఇద్దరికి ఉపముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేశవ్‌ ప్రసాద్ మౌర్య ఓటమిపాలైనప్పటికీ ఆయనను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. మౌర్యతో పాటు, బ్రజేశ్‌ పఠక్‌ నేడు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎకానా స్టేడియంలో జరిగిన యోగి ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. దాదాపు 85వేల మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 273 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో ఒక్క భాజపానే 255 సీట్లు గెలుచుకుంది. యూపీ రాజకీయ చరిత్రలో ఒక సీఎం అధికారం నిలబెట్టుకుని రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని