
Navy: భారత నావికాదళాధిపతిగా అడ్మిరల్ హరికుమార్
ఇంటర్నెట్‌డెస్క్: భారత నావికాదళ 25వ చీఫ్ ఆఫ్ నావెల్ స్టాప్‌గా అడ్మిరల్ ఆర్.హరికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్ నుంచి ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్మిరల్ కుమార్ మాట్లాడుతూ ‘‘చీఫ్ ఆఫ్ నావెల్ స్టాప్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకు గొప్ప గౌరవం. భారత ప్రయోజనాలు, సవాళ్లపై నేను దృష్టిపెడతాను’’ అని పేర్కొన్నారు.
హరికుమార్ 1962లో ఏప్రిల్ 12న జన్మించారు. ఆయన 1983లో ఎన్‌డీఏలో శిక్షణ పూర్తి చేసుకొన్నారు. కేరళ నుంచి నేవీ చీఫ్‌గా ఎదిగిన తొలి వ్యక్తి ఆయనే. తాజా భారత నావికాదళం పలు సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఓ పక్క ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతుండగా.. మరోపక్క చైనా వైపు నుంచి ముప్పు పొంచి ఉంది. అంతేకాదు హరికుమార్ సైనిక దళాల పునర్ వ్యవస్థీకరణలో కూడా కీలక పాత్ర పోషించారు. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కాన్సెప్ట్ తయారీలో కూడా పనిచేశారు.